Homeఅంతర్జాతీయంఘోర విమాన ప్రమాదం.. టూరిస్ట్ విమానం కూలి 13 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. టూరిస్ట్ విమానం కూలి 13 మంది మృతి

క్రైమ్ మిర్రర్ : పర్యాటకులతో వెళ్తున్న ఓ టూరిస్ట్ విమానం కుప్పకూలిన ఘటన పెరూలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో విమానంలోని 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నజ్‌కా మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెరూవియన్ కంపెనీకి చెందిన ఎరోడియానా టూరిస్ట్ విమానం శనివారం ఇకా ప్రాంతం నుంచి బయలుదేరింది. ఇందులో 11 మంది పర్యాటకులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. నజ్‌కా నగర శివారులో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు పడిపోయింది. నేలను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద తీవ్రత కారణంగా అందులో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో 11 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో ఇద్దరు జర్మనీకి చెందిన వారు, ఇద్దరు స్పెయిన్‌కు చెందిన వారు, ఏడుగురు ఇటలీ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఆయా దేశాల్లోనూ విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, మృతుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. విమానం ప్రమాదానికి గురికావడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా? లేక ఇతర కారణాలా అనే కోణాల్లో పెరూవియన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : ఇండోనేషియా నౌకలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 41 మంది గల్లంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు