క్రైమ్ మిర్రర్ : మదురా ద్వీపం సమీప సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 41 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన నౌక ని ముతియారా సంతోసా-2గా గుర్తించారు.
సహాయక చర్యల కోసం తొమ్మిది నౌకలను రంగంలోకి దింపారు. నౌకకు నిప్పంటుకున్న వెంటనే భారీగా పొగలు వ్యాపించాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, నౌకలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : కుర్కురే ప్యాకెట్ తెచ్చిన విషాదం.. టాయ్ బాల్ మింగి బాలుడు మృతి
