క్రైమ్ మిర్రర్ : కుర్కురే ప్యాకెట్‌లో వచ్చిన చిన్న టాయ్ బాల్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు బాల్ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని గౌరీపుర గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు కుర్కురే ప్యాకెట్‌లో వచ్చిన చిన్న బంతితో ఆడుకుంటుండగా పొరపాటున దాన్ని మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఉక్కిరి బిక్కిరయ్యాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలోని ప్రముఖ కుటుంబానికి చెందిన ఏకైక సంతానం కావడంతో స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అయితే బాలుడి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
also read : కన్న కూతురిపై కన్నేసిన ప్రియుడు.. ఆగ్రహంతో తల్లి ఏం చేసిందంటే..?
