Homeక్రైమ్కన్న కూతురిపై కన్నేసిన ప్రియుడు.. ఆగ్రహంతో తల్లి ఏం చేసిందంటే..?

కన్న కూతురిపై కన్నేసిన ప్రియుడు.. ఆగ్రహంతో తల్లి ఏం చేసిందంటే..?

క్రైమ్ మిర్రర్ : కూతురిపై ప్రియుడు అనుచితంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేని ఓ మహిళ ఆగ్రహంతో అతడిపై దాడి చేసి కత్తితో మర్మాంగాన్ని కట్ చేసిన  ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం రూరల్ మండలం రాచనపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేశ్‌కు డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల సురేశ్ సదరు మహిళ కుమార్తెపై కూడా కన్నేశాడు. కొంతకాలంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, దీంతో తన కుమార్తె జోలికి రావద్దని మహిళ ప్రియుడిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ సురేశ్ తన వైఖరి మార్చుకోకపోవడంతో మహిళ ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలోనే సురేశ్ ఎప్పటిలాగే రాత్రి సమయంలో మహిళ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత ఆమె కుమార్తెపై అఘాయిత్యానికి యత్నించాడు.  కుమార్తె కేకలు వేయడంతో తల్లి వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకుంది. ఈ సమయంలో ఆగ్రహానికి గురైన ఆమె వంటగదిలోని కత్తితో సురేశ్‌పై దాడి చేసి మర్మాంగాన్ని కట్ చేసింది.  తీవ్ర గాయాలతో రక్తస్రావమైన సురేశ్‌ను స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సురేశ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
also read : అమెరికాలో అగ్నికీలలు.. వాషింగ్టన్‌కు ‘రెడ్ ఫ్లాగ్’ అలర్ట్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు