Homeఅంతర్జాతీయంఅమెరికాలో అగ్నికీలలు.. వాషింగ్టన్‌కు ‘రెడ్ ఫ్లాగ్’ అలర్ట్

అమెరికాలో అగ్నికీలలు.. వాషింగ్టన్‌కు ‘రెడ్ ఫ్లాగ్’ అలర్ట్

క్రైమ్ మిర్రర్ : అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం భారీ అటవీ కార్చిచ్చుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన మంటలు ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా అటవీ, భూభాగాన్ని దహనం చేశాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. కార్చిచ్చు అదుపు కోసం 4 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్ బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు మంటలను మరింత వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

మంటలు స్పోకేన్ పరిసర నివాస ప్రాంతాల వరకు చేరుకోవడంతో వేలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 4 వేల భవనాలు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వందలాది ఇళ్లను ఖాళీ చేయించినట్లు సమాచారం. కార్చిచ్చు ప్రభావంతో విద్యుత్ సరఫరా దెబ్బతినడంతో దాదాపు 60 వేల మంది వినియోగదారులు విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రులు, నీటి శుద్ధి కేంద్రాలు వంటి కీలక సేవలు కూడా అంతరాయం ఎదుర్కొంటున్నాయి.

భద్రతా చర్యల్లో భాగంగా సుమారు 2.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు ప్రభావం కోట్లాది ప్రజలపై పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తూర్పు వాషింగ్టన్‌తో పాటు పలు ప్రాంతాలకు జాతీయ వాతావరణ సంస్థ ‘రెడ్ ఫ్లాగ్’ హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
also read ; భారీ వర్షాల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు