Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక!

ఏపీలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారాన్ని విడుదల చేసింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:-
విజయనగరం
మన్యం
అల్లూరి
పోలవరం
ఎన్టీఆర్
గుంటూరు
బాపట్ల
పల్నాడు
కర్నూలు
ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని ఎస్డీఎంఏ పేర్కొంది.

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద టెన్షన్:- మరోవైపు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగుల మేర నీరు ఉండటంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగి నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చాక్లెట్ రోజుకు ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా!

కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా.. పరగడుపున ఈ నీళ్లు తాగండి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు