Hometelanganaతెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి...!

తెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి…!

  • తెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి…!

  • ఢిల్లీలో గట్టిగానే లాబీయింగ్ చేస్తున్న రాములమ్మ

  • ముమ్మర ప్రయత్నాల్లో ఆశావాహులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన రోజుకో వార్త బయటకు వస్తోంది. ఆశావహులు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాములమ్మ ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతుండడం విశేషం.

కాంగ్రెస్ అగ్రనేతలతో విజయశాంతి వరుసగా భేటీలు అవుతుండడం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తరణలో మహిళా నేతల కోటాలో విజయశాంతికి పదవి దక్కడం ఖాయమని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త ప్రచారం మొదలైంది. కీలకమైన లాబీయింగ్ తో విజయశాంతి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: సిగరెట్ కన్నా అగరబత్తి పొగ ఆరోగ్యానికి హానికరమా…?

చేర్పులు, మార్పులు ఖాయం
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరూ మహిళా మంత్రులు ఉన్నారు. కొండా సురేఖతోపాటు సీతక్క రేవంత్ క్యాబినెట్లో కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఏడాది చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడున్న మంత్రుల్లో సీనియర్లను వివిధ రాష్ట్రాల ఇన్చార్జిలుగా నియమించే అవకాశం ఉంది.

కొందర్ని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం మంత్రివర్గంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కారంతో కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది.

Also Read: సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి…! వృద్దురాలి క‌న్నీటి విన‌తి…..

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అభిప్రాయం ఉంది.

హస్తినలో రాములమ్మ బిజీ..
మరోవైపు ఎమ్మెల్సీ రాములమ్మ మాత్రం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయశాంతి రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. తరచూ పార్టీ మారుతారన్న అపవాదు ఆమెపై ఉంది. అందుకే ఇంతవరకు మంత్రి పదవి కూడా చేపట్ట లేకపోయారు.

Also Read: Good News For Students: విద్యార్థులకు భారీ శుభవార్త…!

కెసిఆర్ తో కలిసి ఉన్నప్పుడు కేవలం ఎంపీగా మాత్రమే అయ్యారు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్య అనిపించుకోవాలని చూస్తున్నారు. అందుకే సర్వశక్తులు ఒడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అత్యంత సీనియర్ నేత..
వాస్తవానికి విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత. 1998 లోనే ఆమె బిజెపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. కెసిఆర్ సూచనతో 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో తన పార్టీని విలీనం చేశారు. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

Also Read: OTTలో ఈ వారం వినోదాల జాతర…!

2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని చెప్పి విజయశాంతి పై వేటు వేశారు కెసిఆర్. వెంటనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో బిజెపిలో చేరారు.

అక్కడకు మూడేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మొన్ననే ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు విజయశాంతి. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read: స్టాన్‌ఫోర్డ్ వేదికగా సుందర్ పిచాయ్‌కు విద్యార్థుల నిరసన – గూగుల్ ఒప్పందాలపై ఆగ్రహం

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు