Hometelanganaబిగ్‌బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షకు డేట్ ఫిక్స్..!

బిగ్‌బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షకు డేట్ ఫిక్స్..!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- బిగ్‌బాస్ తెలుగు 10 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సీజన్‌కు ముందు నిర్వహించే అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ తాజా ప్రోమోను విడుదల చేసింది. గత సీజన్ విజేత కళ్యాణ్ పడాలను ఈ ప్రోమోలో చూపిస్తూ, సామాన్యుడి నుంచి విజేతగా ఎదిగిన ఆయన ప్రయాణాన్ని హైలైట్ చేసింది. దీంతో పదో సీజన్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికే తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు పదో సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోలో ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అనే కాన్సెప్ట్‌తో ఈ సీజన్ మరింత కొత్తగా ఉండబోతుందని సంకేతాలు ఇచ్చారు. దీంతో బిగ్‌బాస్ 10లో ఎన్నో కొత్త ట్విస్టులు ఉండబోతున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.

కోర్టు షాక్‌తో బీజేపీ నేత ప్రాణేష్ రాజీనామా.. ఎమ్మెల్సీగా గాయత్రి శాంతేగౌడకు అవకాశం

గత సీజన్‌లో కామన్‌మెన్‌కు ఇచ్చిన అవకాశం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఆరుగురు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో ఇద్దరు ఫైనల్ వరకు చేరుకున్నారు. చివరకు మిలటరీ బ్యాక్‌గ్రౌండ్‌కు చెందిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. అదే తరహాలో ఈసారి కూడా అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కొందరు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నారు.తాజా ప్రోమోలో కళ్యాణ్ పడాల తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, ఓ సాధారణ వ్యక్తి కూడా పెద్ద కలలు నెరవేర్చుకోవచ్చని చెప్పిన సందేశం ఆకట్టుకుంది. చివర్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అగ్నిపరీక్ష ఉంటుందని, ఆ పరీక్షకు సిద్ధమా అంటూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. అలాగే ఆగస్టు 15 నుంచి బిగ్‌బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు.మరోవైపు కొత్త సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పేర్లు వైరల్ అవుతున్నాయి. పలువురు టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాంకర్లు, కామెడీయన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, నిర్వాహకులు మాత్రం ఇప్పటివరకు అధికారిక జాబితాను ప్రకటించలేదు. ప్రస్తుతం సెలెక్షన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. అగ్నిపరీక్ష సీజన్ 2 పూర్తయ్యాక కామన్‌మెన్ ఎంపిక కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10పై అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది.

 ‘సారీ హృతిక్’ ట్రెండ్‌పై క్లారిటీ: హృతిక్ రోషన్ స్పందన వైరల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు