క్రైమ్ మిర్రర్ : హనుమకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. యాదవనగర్లో నివసిస్తున్న అనిల్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనిల్, రజిత కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలు, అనుమానాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారం ప్రకారం.. అనిల్, రజిత ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
also read : ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య.. రాళ్లు, ఇటుకతో దాడి
