HomeసినిమాFolk Star Nagadurga: జానపద గాయని నుంచి హీరోయిన్‌గా.. నాగదుర్గ కొత్త ప్రయాణం!

Folk Star Nagadurga: జానపద గాయని నుంచి హీరోయిన్‌గా.. నాగదుర్గ కొత్త ప్రయాణం!

టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘కోర్ట్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి, ఆ తర్వాత చేసిన చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ

ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని, డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోక్ సింగర్‌గా నాగదుర్గకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె పాటలు, స్టేజ్ ప్రదర్శనలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే నాగదుర్గ తమిళంలో కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆమె నటించిన ‘లవ్.. ఓ లవ్’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తెలుగులో “కలివి వనం” అనే సినిమాలో కూడా నటించింది. అయితే పెద్ద నిర్మాణ సంస్థలో హీరోయిన్‌గా అవకాశం రావడం ఇదే మొదటిసారి.

రెండో సినిమాకే పాపులర్ బ్యానర్ లో అవకాశం

రెండో సినిమాకే సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రముఖ బ్యానర్‌లో అవకాశం దక్కడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని, నాగదుర్గ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ తెరపై కొత్తగా కనిపించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఫోక్ సింగర్‌ గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న నాగదుర్గ, హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు