HomeసినిమాRRR Malli: అమాయకమైన మల్లి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. నెట్టింట ఫోటోలు వైరల్!

RRR Malli: అమాయకమైన మల్లి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. నెట్టింట ఫోటోలు వైరల్!

RRR సినిమాలో “కొమ్మ ఊయల.. కోన జంపాల” పాటతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న చిన్నారి మల్లిని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చిన్న వయసులోనే మంచి గుర్తింపు సంపాదించింది. అమాయకమైన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

హాట్ హాట్ గా మారిపోయిన మల్లి!

మల్లిగా నటించిన చిన్నారి అసలు పేరు ట్వింకిల్ శర్మ. ప్రస్తుతం ఆమె చదువుతో పాటు తనకు ఇష్టమైన డ్యాన్స్‌ పై కూడా దృష్టి పెడుతోంది. సోషల్ మీడియాలో కూడా ట్వింకిల్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవల ట్వింకిల్ పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అమాయకంగా కనిపించిన మల్లి, ఇప్పుడు ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇదేనా మన మల్లి?” అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

హీరోయిన్ గా అడుగు పెట్టేనా?

చిన్నప్పుడే నటనతో మెప్పించిన ట్వింకిల్, ఇప్పుడు తన అందంతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఆమె హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలనటులు హీరోయిన్లుగా మారి మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో ట్వింకిల్ కూడా అదే దారిలో వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ట్వింకిల్‌ కు నటనతో పాటు మంచి డ్యాన్స్ టాలెంట్ కూడా ఉంది. అందం, అభినయం రెండూ ఉండటంతో భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రావచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిన్నారి ఎప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా కనిపిస్తుందో చూడాలి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు