Homeక్రైమ్ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన భర్త.. గోదావరిలో మృతదేహం పడేసినట్లు ఆరోపణలు!

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన భర్త.. గోదావరిలో మృతదేహం పడేసినట్లు ఆరోపణలు!

క్రైమ్ మిర్రర్ : సోషల్ మీడియా వేదికగా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలం పాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే కుటుంబంలో ఎదురైన విషాదం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వారి జీవితాలను విషాదాంతం చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే భర్త హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

టేకులపల్లికి చెందిన నరేందర్ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి సోషల్ మీడియా ద్వారా భవానీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఎనిమిది నెలల క్రితం ఓ మగబిడ్డ జన్మించగా, ఆ చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. అప్పటి నుంచి కుటుంబంలో పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా నరేందర్ తన భార్య భవానీని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గోదావరిలో మృతదేహం పడేసినట్లు ఆరోపణలు

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం నరేందర్ తన భార్య భవానీని హత్య చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి తీసుకెళ్లి గోదావరి నదిలో పడేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై విషయం బయటకు రావడానికి ముందే నరేందర్ కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ దారుణానికి దారితీసిన అసలు కారణాలేంటి? భార్యను హత్య చేయడానికి నరేందర్ వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? గోదావరి నదిలో పడేసినట్లు చెబుతున్న భవానీ మృతదేహం పోలీసులకు లభించిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటా తాకి 10 నెలల చిన్నారి మృతి.. జగిత్యాలలో విషాదం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు