Homeఆంధ్ర ప్రదేశ్తీవ్ర నైరాశ్యంలో వైసిపి...!

తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలు

  • మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షం

  • ప్రాదేశిక పోలింగ్ లోను స్పష్టమైన సరళి

  • తేలిపోతున్న సీనియర్ల మాటలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను కూటమి దక్కించుకుంది. వైసీపీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఇటువంటి సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. చంద్రబాబు కొడితే ఆ దెబ్బ పోస్టుమార్టం లో కూడా కనిపించదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సైతం విస్మయానికి గురిచేసాయి. చంద్రబాబు రాజకీయ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పుపడుతూ నిందించాలనే తాపత్రయంలో అంబటి మాట్లాడినప్పటికీ.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి వరుసగా సాధిస్తున్న ఫలితాలతోనే ఈ కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతుంది.

ఉక్కిరి బిక్కిరి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు వద్దు అంటే.. ఆయన సొంత ప్రాంతంలోనే విపరీతంగా జరిగాయి. ఆపై కడప జిల్లాలోనే కూటమి ప్రభంజనం సృష్టించింది. సొంత నియోజకవర్గ పులివెందులలో సైతం టిడిపి అద్భుత విజయం అందుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రాదేశిక ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్తు స్థానాలను సైతం తెలుగుదేశం కూటమి సునాయాసంగా దక్కించుకునే పరిస్థితి ఉంది. ఈ పరిణామాల క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనతో ఉంది.

అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు…

సందట్లో సడే మియా అన్నట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి నుంచి చంద్రబాబు కొడితే అలా ఉంటుంది అనే మాట ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టణ ఓటర్లు కూటమికి పట్టం కట్టి ఫ్యాన్ పార్టీని ఊడ్చి పడేసారు. అటు క్షేత్రస్థాయిలో బ్యాలెట్ ముగిసి.. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ సరళి చూస్తుంటే కూటమికి ఏకపక్ష విజయం ఖాయమని స్పష్టత వచ్చింది. అందుకే అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా చంద్రబాబుకు ఎలివేషన్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారిపోయింది.

సీనియర్లలో భయం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పరంపర కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా పంచాయితీ ఎన్నికలు కూడా ఏకపక్షంగా జరగనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో కూడా అదే భయం కనిపిస్తోంది. ప్రత్యర్థులను శారీరకంగా హింసించడం, కేసులు పెట్టడం, రచ్చ చేయడం లాంటి పాత తరహా రాజకీయాలకు భిన్నంగా.. సంక్షేమం, సమర్థ పాలన, మైక్రో లెవెల్ ఎన్నికల మేనేజ్మెంట్ తో చంద్రబాబు వేసే దెబ్బలు పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు గ్రహించారు. అందుకే ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందో చెప్పుకోలేక.. బయటకు ఎలా గాయమైందో చూపించుకోలేక పోస్టుమార్టం లో కూడా కనిపించదు అంటూ ఒక రకమైన నిస్సహాయతతో కూడిన నిజాన్ని అంబటి రాంబాబు బయట పెట్టేశారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రామచంద్ర రావుది గొప్ప సాహసమే…!
  2.  మైదానానికి వీడ్కోలు.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు ‘రొనాల్డో’ గుడ్‌బై!
  3.  గురువుపై అభిమానానికి హద్దుల్లేవు… రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం!
  4.  స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు