హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే టీ హబ్‌ను ఏర్పాటు చేసి, ప్రపంచ ఆవిష్కరణ పటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కలలకు రెక్కలు తొడగడమంటే టీహబ్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ను నంబర్‌వన్‌గా తీర్చదిద్దాలనే దూరదృష్టితోనే కేసీఆర్ టీహబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలకు హైదరాబాద్‌ను కేరాఫ్ అడ్రస్‌గా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. 11 ఏండ్ల ప్రస్థానంలో వేలాది మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి, వారి ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా మార్చేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసిందని ప్రశంసించారు. టీహబ్ తన 11 ఏండ్ల ప్రయాణం లో ఇప్పటివరకు 3,300కుపైగా స్టార్టప్‌లకు ప్రో త్సాహం అందించిందని వెల్లడించారు.
కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకొనే యువతకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు అనుభవజ్ఞులైన మెంటార్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికరంగ ప్రముఖులతో అనుసంధానం కల్పించిందని తెలిపారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్టార్టప్‌లకు వేదికగా నిలిచిందని గురువారం ఎక్స్ వేదికగా పేరొన్నారు. ఈ సందర్భంగా టీహబ్ ఫొటోను కూడా షేర్ చేశారు. కేవలం స్టార్టప్‌లకు కార్యాలయ వసతి కల్పించే సంస్థగానే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే సమగ్ర ఆవిషరణల వ్యవస్థగా టీహబ్ ఎదిగిందని తెలిపారు.
తెలంగాణ యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వం, పెట్టుబడుల అవకాశాలను అందించడంలో కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ టీహబ్ ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆవిష్కరణ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. టీహబ్ ప్రారంభోత్సవం సందర్భంగా దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.11 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీహబ్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ, యువ ఆవిషర్తలకు సాధికారత కల్పించి, వారి కలలను సాకారం చేసే దిశగా సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఇవి కూడ చదవండి:
-
ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు.. ఇద్దరు మృతి!
-
దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
-
అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
-
చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి .. ఘటనపై అనుమానాలు!
