Homeతెలంగాణఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...!

ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు…!

  • ఈనెల 14తో మూడు పదవులు ఖాళీ

  • రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎంపిక చేయాల్సిందే

  • లేకుంటే తిరస్కారం ఖాయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సరికొత్త రాజకీయ సందడి. ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ నెల 14 తో మరో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత సంక్లిష్టంగా మారింది. గత పదేళ్లపాటు పార్టీ అధికారంలో లేకపోయినా జండా మోసిన సీనియర్ నేతలకు పెద్దల సభలో అవకాశం కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో చాలామంది నేతలు క్యూ కడుతున్నారు. సామాజిక సమీకరణలతో పాటు తమ సీనియారిటీని, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

విపరీతమైన పోటీ…

కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకమైన పోటీ వాతావరణం ఉంటుంది పదవులకు. అందునా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులు అంటే విపరీతమైన డిమాండ్. ప్రధానంగా ఎస్సీ మాదిగ వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, నాగరి గారి ప్రీతం, సంపత్ కుమార్, చారుకొండ వెంకటేష్.. ఓసి బ్రాహ్మణ కోటాలో హర్కర వేణుగోపాల్, దయాసాగర్.. బీసీ పద్మశాలి, యాదవ వర్గాల నుంచి ఈరవత్రి అనిల్, కైలాష్ నేత, చరణ్ కౌశిక్ యాదవ్ వంటి అనేకమంది ప్రముఖులు రేసులో ముందంజలో ఉన్నారు. అయితే కేవలం పార్టీ విధేయత, సామాజిక సమీకరణలను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. పూర్తిగా రాజకీయ నేతల పేర్లను రాజ్ భవన్ కు పంపితే.. ఆ ఫైలు గవర్నర్ వద్ద నిలిచిపోయే ప్రమాదం స్పష్టంగా ఉంది.

గవర్నర్ అభ్యంతరాలు…

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) నిబంధనల ప్రకారం.. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యే వ్యక్తులు సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సహకార రంగం, విశిష్ట సాంఘిక సేవ వంటి నిర్దిష్ట రంగాల్లో విశేషమైన ప్రతిభ, విశిష్ట అనుభవం కలిగిన వారై ఉండాలి. గతంలోనూ కేవలం రాజకీయ నేతలను ఈ కోటా కింద సిఫారసు చేసినప్పుడు రాజ్ భవన్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గులాబీ పార్టీ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా కింద నామినేట్ చేయగా.. వారు కేవలం రాజకీయ ప్రముఖుల తప్ప రాజ్యాంగం నిర్దేశించిన రంగాల్లో విశిష్ట నిపుణులు కాదనే కారణంతో అప్పటి గవర్నర్ ఆ సిఫారసులను తిరస్కరించారు. అప్పట్లో అదో రాజకీయ వివాదం.

సంకట స్థితి…

ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ఆమోదిస్తేనే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకట స్థితిగా మారనుంది. రాజ్ భవన్ నిబంధనలకు తగిన సమర్ధన, అర్హతలను చూపించాల్సి ఉంటుంది. ఎస్సీ మాదిగ కోటాలో పేర్లను ప్రతిపాదిస్తే.. వారు క్షేత్రస్థాయిలో చేసిన దళిత హక్కుల పోరాటాలు, ప్రజాహిత సాంఘిక సేవలను రికార్డుల రూపంలో చూపించాల్సి ఉంటుంది. సాహిత్యం తో పాటు విద్యారంగ విస్తరణ, సహకార రంగాల్లో వారికి ఉన్న అనుభవాన్ని బలమైన సాక్షాల రూపంలో నివేదికలను పొందుపరచాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎమ్మెల్సీ పదవుల ఎంపిక అనేది రేవంత్ సర్కార్కు కత్తి మీద సామే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ట్రంప్‌కు సవాళ్ల సుడిగుండం: రాజకీయ, దౌత్య రంగాల్లో వరుస పరాజయాలు
  2.  మైదానానికి వీడ్కోలు.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు ‘రొనాల్డో’ గుడ్‌బై!
  3.  గురువుపై అభిమానానికి హద్దుల్లేవు… రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం!
  4.  స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు