-
2721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్
-
దూకుడు మీద ఉన్న కూటమి ప్రభుత్వం
-
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియకు అవకాశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ రెండో డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా వేలాది పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మిగిలిన, నూతనంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ రెండో నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. దీంతో ఏపీలో నిరుద్యోగుల కలల పంట పండడంతో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. ఈ రెండో డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2721 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నిజంగా ఇది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు గొప్ప అవకాశం.
పోస్టులు ఇలా…
ప్రస్తుతం జారీ అయిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి సాధారణ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 1205 సెకండరీ గ్రేడ్ టీచర్, 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు దివ్యాంగుల ప్రత్యేక విద్యా విభాగంలో 350 పోస్టులు, విద్యాశాఖ పరిధిలోని వివిధ సంక్షేమ సొసైటీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పిఈటి కేటగిరీలలో 260 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం.. డీఎస్సీ ఎంపిక విధానాన్ని అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఆన్లైన్లో దరఖాస్తులకు…
డీఎస్సీ కి సంబంధించి అర్హులైన అభ్యర్థులు అధికారికంగా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల వరకు నిర్ణయించగా.. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి. ఎంపిక ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోరుకు 20% వెయిటేజీ, రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ వర్తింపజేయనున్నారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుండడం పై అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ప్రకటనలకే పరిమితమై యాళ్ల తరబడి అభ్యర్థులను వంచించారని.. కానీ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం విద్యారంగా దారిలో పెట్టడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇది కూటమికి సానుకూల అంశం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు.. ఇద్దరు మృతి!
-
దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
-
అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
-
చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి .. ఘటనపై అనుమానాలు!
