క్రైమ్ మిర్రర్,సినిమా:-
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ఇంటివారు కాబోతున్నారు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మెగా మరియు అల్లు కుటుంబాలకు చెందిన కథానాయకులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ శుభకార్యానికి విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.మెగా హీరోలందరూ ఒకే వేదికపై సందడి చేసిన క్షణాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ వేడుకలో అందరూ కలిసి దిగిన ప్రత్యేకమైన గ్రూప్ ఫోటోను రామ్‌చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సాయిధరమ్ తేజ్ – కిరణ్మయిల వివాహ వేడుక డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ట్రంప్‌కు సవాళ్ల సుడిగుండం: రాజకీయ, దౌత్య రంగాల్లో వరుస పరాజయాలు
మైదానానికి వీడ్కోలు.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు ‘రొనాల్డో’ గుడ్‌బై!
