Homeతెలంగాణకాంగ్రెస్ దీపావళి స్కెచ్...!

కాంగ్రెస్ దీపావళి స్కెచ్…!

  • పండుగ నాడు ఇందిరమ్మ ఇళ్లలో దీపాల వెలుగులు

  • హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు

  • ప్రతిపక్షాల విమర్శలకు చెక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల అమలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమలు విషయంలో అనేక రకాల విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రచార లోపాన్ని అధిగమించేందుకు.. రేవంత్ రెడ్డి మంత్రివర్గం సరికొత్త రాజకీయ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేరుతో.. ఒక వినూత్న ప్రజా సంబంధాల కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ అధికారికంగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. పండుగ వేళ ఆ ఇళ్లల్లోని ప్రభుత్వం తరుపున వేడుకలు జరపాలని నిర్ణయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలన్నది సర్కార్ ప్రధాన ఉద్దేశం.

పథకాల విషయంలో ప్రచారం తక్కువ…

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. సంక్షేమ పథకాల విషయంలో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రజాక్షేత్రంలో ఉన్న భావనలు ప్రభుత్వాన్ని కొంత డిఫెన్స్ లో నెట్టాయి. అసలు రాష్ట్రంలో ఒక పేదవాడికైనా ఇల్లు మంజూరు అయిందా? లబ్ధిదారుల ఖాతాల్లోకి నయా పైసా అయినా జమ అయిందా? అనే సందేహాలు సామాన్య ప్రజల్లో కూడా బలంగా నాటుకుపోయాయి. క్షేత్రస్థాయిలో వేలాదిమంది నిర్మాణాలు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారన్న విపక్షాల ప్రచారం హోరెత్తుతోంది. ప్రభుత్వం తమ శాఖా పరమైన ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమైందన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.

గణాంకాలతో సహా వివరణ…

విపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. దాదాపు 2.25 లక్షల ఇళ్ళను పూర్తిస్థాయి నిర్మాణానికి తీసుకువచ్చామని ప్రభుత్వం ఇప్పుడు అధికారిక గణాంకాలతో ముందుకొచ్చింది. ఎంత పని చేసినా దాన్ని మార్కెటింగ్ చేసుకో లేకపోతే రాజకీయంగా శూన్యమే మిగులుతుందన్న చేదు నిజాన్ని ఆలస్యంగా గ్రహించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే దీపావళి పండుగను తమ విజయాలను ప్రదర్శించే వేదికగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఎల్ల నిర్మాణాలు పూర్తి కాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట తప్పిందని చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాలంటే.. పూర్తయిన రెండున్నర లక్షల ఇళ్ల ముంగిట స్వయంగా దీపాలు వెలిగించి చూపించడమే సరైన సమాధానమని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాంది. పండుగ సంబరాల ముసుగులో విపక్షాల నోళ్లు ముగించేందుకు ఇదొక వ్యూహాత్మక అస్త్రంగా మారింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడ చద‌వండి:
  1.  ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు.. ఇద్దరు మృతి!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4. చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి .. ఘటనపై అనుమానాలు!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు