Homeసినిమాచాలా రోజుల తర్వాత జంటగా అభిషేక్‌ – ఐశ్వర్య.. దీపావళి వేడుకలో సందడి!

చాలా రోజుల తర్వాత జంటగా అభిషేక్‌ – ఐశ్వర్య.. దీపావళి వేడుకలో సందడి!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా కలిసి బహిరంగ కార్యక్రమాల్లో కనిపించని ఈ జంట.. తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకలో జంటగా సందడి చేసింది. ఇద్దరూ కలిసి కెమెరాలకు పోజులివ్వడంతో పాటు, ఒకరిపై మరొకరు చూపించిన ఆప్యాయత అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఈ వేడుకకు అభిషేక్‌ బచ్చన్‌ నల్లటి కుర్తాలో హాజరుకాగా, ఐశ్వర్యారాయ్‌ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో ఐశ్వర్య ప్రేమగా అభిషేక్‌ వైపు చూడటం, అనంతరం ఆయన ఛాతీపై తల వాల్చడం కనిపించింది. అభిషేక్‌ సైతం ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుని కెమెరాలకు ఫోజులిచ్చారు. వీరిద్దరి మధ్య కనిపించిన అనుబంధానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విడాకుల ప్రచారానికి చెక్‌ పెట్టిన జంట?

కొంతకాలంగా అభిషేక్‌, ఐశ్వర్య వైవాహిక జీవితంపై సోషల్‌ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారమయ్యాయి. ఇద్దరూ కలిసి వేడుకలకు హాజరుకాకపోవడం, వేర్వేరుగా కనిపించడం వంటి అంశాలతో వీరు విడిపోతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అభిషేక్‌ గతంలోనే ఖండించారు. తాజాగా ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ పుకార్లపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వేడుకకు వారి కుమార్తె ఆరాధ్య మాత్రం హాజరుకాలేదు.

సినిమా పరిచయం నుంచి ప్రేమ వరకు..

అభిషేక్‌, ఐశ్వర్య పరిచయం 1999లో ‘ఢాయ్‌ అక్షర్‌ ప్రేమ్‌ కే’ సినిమా ఫొటోషూట్‌ సమయంలో ప్రారంభమైంది. అనంతరం ‘కుచ్‌ నా కహో’, ‘ఉమ్రావ్‌ జాన్‌’, ‘ధూమ్‌ 2’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సినిమాల సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ముఖ్యంగా ‘గురు’ సినిమా ప్రమోషన్ల కోసం 2007లో న్యూయార్క్‌ వెళ్లిన సమయంలో వీరి బంధం మరింత బలపడింది.

అదే ఏడాది ఏప్రిల్‌ 20న ముంబయిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అభిషేక్‌, ఐశ్వర్య వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2011లో వీరికి కుమార్తె ఆరాధ్య జన్మించింది. తాజాగా దీపావళి వేడుకలో ఈ జంట కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

also read: కాంగ్రెస్ దీపావళి స్కెచ్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు