Homeతెలంగాణవిచారంలో విచారణ నివేదిక.. నాలుక గీసుకునే పరిస్థితి కరువు..!

విచారంలో విచారణ నివేదిక.. నాలుక గీసుకునే పరిస్థితి కరువు..!

  • అండగా ముగ్గురు నేతలు.. సస్పెండ్ నిలిపివేత..!?

  • విచారణ జరగకుండా ఆపేది మీరే, విచారణ పూర్తయిన నివేదికపై చర్యలు నిలిపేది తమరే.!?

  • ఖుధాబక్షుపల్లి, లెంకలపల్లి గ్రామాల విచారణ నివేదిక బూడిదపాలేనా!?

  • ఉన్నత అధికారులు ఎందుకు ఆ నివేదికలపై చర్యలు తీసుకోవడం లేదు!?

  • ఏడు ఏండ్ల నుండి ఒకే మండలంలో కొలువు.. బదిలీ మరిచిపోయారా, లేక మరిపిస్తున్నారా..!?

  • డీపీవో విచారణలో తమరికేం పని.. అధికారివా, సర్పంచ్ వా, లేక స్వచ్చంద సంస్థ ప్రతినిధివా..!?

  • బహిరంగగా ప్రెస్ మీట్.. సెక్రటరీలకు నిబంధనలు వర్తించవా.. మూకుమడి సెలవులు కోరడం మీ ఇష్టమేనా..!?

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్) : రాజకీయం ఎంతటి పని చేస్తుందో చూడండి. విచారణ జరిగిన నివేదికపై చర్యలను సైతం ఆపేస్తున్నారు.. మర్రిగూడ మండలంలో ఖుధాబక్షుపల్లి, లెంకలపల్లి గ్రామాల నిధులపై వచ్చిన పిర్యాదుల మేరకు, ఉన్నత అధికారుల ఆజ్ఞల ప్రకారం విచారణ జరిపారు. ఆపై నివేదికను జిల్లా ఉన్నత అధికారులకు నివేదించారు. కానీ ఈ విచారణ, నివేదిక సైతం రాజకీయ నాయకుల చెప్పు కింద, మగ్గిపోతుందనేది పలువురి అభిప్రాయం..!? నిజానికి అది నిజమనే అంటున్నారు చాలా మంది. ఈ రెండు గ్రామాలపై విచారణ పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికి, ఆ నివేదిక నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండాపోవడం విడ్డూరం..!? నివేదిక చూసారా లేక చెదపట్టిందా అంటున్నారు పలువురు..!? పలు పిర్యాదుల నేపథ్యంలో ఈ గ్రామాలపై ఉన్నత అధికారులు విచారణ జరిపారు. అట్టి నివేదిక సైతం జిల్లా కలెక్టర్ కి కూడా చేరింది..!? కానీ ఈ నివేదికపై చర్యలు తీసుకోకుండా నిలిపివేస్తున్నారు మండలంలోని ముగ్గురు నేతలు!? ఒకరేమో ఏ పార్టీనో తెలియదు, మరొక్కరు అదే పార్టీలో ఉండి వెన్నుపోటు పొడుస్తారు, ఇంకొక్కరు ఎలాంటి లీడరో అర్ధం కాదు.!? అలాంటి నేతల మాటలు వింటూ, జిల్లా ఉన్నత అధికారులు, విచారణ జరిగిన నివేదికపై చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదం..!? ఈ నేతలు ఏకంగా సస్పెండ్ ను సైతం నిలిపివేస్తున్నారు, ఆ ఫైల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోగలుగుతున్నారంటే, మన ఉన్నత అధికారుల లాలూచి ఏ స్థాయిలో ఉందో తెలియాల్సి ఉన్నది.!? ఇదంతా ఒక ఎత్తయితే 15వ ఆర్థిక సంఘం నిధుల, విచారణ జరగాల్సిన గ్రామాలను కూడా, ఉన్నత అధికారులను మభ్యపెట్టి నిలిపివేయడం విస్మనీయం..!?

—ఖుధాబక్షుపల్లి, లెంకలపల్లి విచారణ బూడిదపాలేనా

నేను గిచ్చినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్.. అనే సామెతకు, ఏమాత్రం తేడా లేకుండా పోయింది అధికారుల చర్యలు. పిర్యాదు వచ్చింది ఎంక్వయిరీ చేసాము.. అంతే కానీ అధికారుల చర్యలు అందని ద్రాక్షలా మారింది.!? ఇప్పటికే విచారణ పూర్తయిన గ్రామాలపై ఎటువంటి చలనం లేకపోవడం, విచారణ జరగాల్సిన గ్రామాలపై ఉలుకు పలుకు లేకపోవడంతో, అధికారుల చర్యలకు ఏమాత్రం విలువ లేకుండాపోయింది..!? ఇప్పటికి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.!? ఈ నిర్లక్ష్యంతో ఉన్నత అధికారులు సభ్యసమాజానికి ఎం మెస్సేజ్ ఇస్తున్నారో అధికారులే చెప్పాలి..!?

  • ఏండ్ల నుండి ఒకే మండలంలో కొలువు.. బదిలీ మరిచారా.. మరిపిస్తున్నారా..!?

ఏండ్ల నుండి ఒకే మండలంలో ఉద్యోగం చెయ్యడం, స్థానిక నాయకుల పలుకుబడి, రాజకీయ అండదండలు పెరగడంతో, తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయారని, ఉద్యోగం మరిచి రాజకీయాలు చేస్తూ మండలాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ప్రజల వాదన..!? తాము చెయ్యాల్సిన బాధ్యతలను మరిచి, ఉన్నత అధికారులను బెదిరించే స్థాయికి సెక్రటరీలు ఎదిగారనే వాదన రోజు రోజుకు బలపడుతుంది..!? ఏండ్ల నుండి సొంత స్థానిక మర్రిగూడ మండలంలో పని చేస్తున్న సెక్రటరీలపై, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!? గతంలో ఎన్నికల సమయంలో సస్పెండ్ అయిన ఈ ఉద్యోగి, మళ్ళీ పైరవితో అదే మండలంలో పోస్టింగ్ తెచ్చుకోవడం దేనికి సంకేతం..!? ఏకంగా ఉన్నత అధికారులపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధం కాదా.. వారికి సిసిఏ నిబంధనలు వర్తించవా..!? మూకుమడి సెలవులు పెట్టి, ఎవరిని బెదిరిస్తున్నారు..!? గ్రామ అభివృద్ధి అంటే లెక్కలేదా..!? పంచాయతీ సెక్రటరీల ఈ ప్రవర్తనపై ఉన్నత అధికారుల మౌనం వెనుక అంతర్యం ఏమైఉంటుంది..!?

  • డీపీఓ విచారణలో మీకేం పని.. ఆహ్వానం వచ్చిందా పదురుకొని వచ్చారా..

ఎంపీడీఓ పై వచ్చిన పిర్యాదు నేపథ్యంలో, డీపీవో విచారణకై మర్రిగూడ వచ్చారు.. ఈ విచారణకు అధికారులు మాత్రమే హాజరు కావలసి ఉండగా, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రస్తుత ప్రజా ప్రతినిధుల భర్తలు దర్శనం ఇవ్వడం విడ్డూరం..!? వచ్చిన ఆ నేతలు విచారణ అధికారి డీపీవోకు పర్సనల్ ఎజెండాతో కక్కేసుకోవడం వెనుక, ఓ యువ నాయకుడి పిర్యాదు లెక్కకు రావద్దని అక్కసుకక్కడం నిజం కాదా..!? ఖుధాబక్షుపల్లి విచారణపై సెక్రటరీని సస్పెండ్ చెయ్యొద్దని, ఆ మాజీ నేత చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి..!? నిర్లక్ష్యం, తప్పు చేసే అధికారికి వత్తాసు పాడటం, పర్సనల్ ఎజెండాతో మిగతా అధికారులపై నోరు పారేసుకోవడం విడ్డూరం..!? అసలు డీపీఓ విచారణకు నీకేం పని, ఆ విచారణలో హంగామా చేసే హక్కు ఎవరిచ్చారు.. ఈ హంగామా దేనికి చేస్తున్నావో జనాలకు తెలియదా..!? మీ పర్సనల్ అంశాలతో ఇంకా ఎంతమంది దళితులను ఆగం చెయ్యనున్నారో చెప్పండి.!? పంచాయతీ సెక్రటరీలు బహిరంగగా ప్రెస్ మీట్ పెట్టడం, మూకుమడి సెలవుల నిరసన తెలపడం, ఏ నిబంధనలలో ఉందని ప్రజలు అడుగుతున్నారు..!? విచారణ పూర్తయిన నివేదికపై ఉన్నత అధికారుల గుడ్డిచూపు వెనుక, అసలు మతులబుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..!? ఇప్పటికైనా ఉన్నత అధికారులు విచారణ జరిగిన గ్రామాల నివేదికపై చర్యలు తీసుకోవాలని, 15వ ఆర్థిక సంఘం నిధులపై మండల వ్యాప్తంగా ఎంక్వయిరీ జరగాలని మర్రిగూడ వాసులు కోరుతున్నారు..!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు