Homeక్రైమ్కూతురితో ప్రేమాయణం.. ఉద్యోగిని కొట్టి చంపిన వ్యాపారవేత్త!

కూతురితో ప్రేమాయణం.. ఉద్యోగిని కొట్టి చంపిన వ్యాపారవేత్త!

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యాపారవేత్త యువ ఉద్యోగిని హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్‌రాజ్ అనే వ్యాపారవేత్త వద్ద కిరణ్ (22) అనే యువకుడు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆనంద్‌రాజ్ 19 ఏళ్ల కుమార్తెతో కిరణ్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కిరణ్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, ఈ హత్య ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని కిరణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆనంద్‌రాజ్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, హత్యకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: బీజాపూర్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్.. పేలుడు పదార్థాలు స్వాధీనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు