-
రూ. 12,500 కోట్ల పెట్టుబడి తో సరికొత్త ప్లాంట్
-
విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో ఒప్పందం
-
భారీగా పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది కియా కార్ల కంపెనీ. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అనంతపురం తయారీ కేంద్రం కార్యకలాపాలను విస్తరించేందుకు ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ.12,500 కోట్లు భారీ పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు.. ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడమే లక్ష్యంగా ఈ పెట్టుబడిని మళ్ళిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం అనంతపురం ప్లాంట్‌లో వార్షికంగా సుమారు మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. ఈ కొత్త విస్తరణతో ఆ సంఖ్య ఏకంగా ఐదు లక్షల యూనిట్లకు చేరుకోనుంది.
సరికొత్తగా టార్గెట్…
కంపెనీ ఉత్పత్తి ప్రణాళికలో భాగంగా కొత్త లక్ష్యాన్ని విధించారు. దీని ద్వారా కంపెనీకి మరిన్ని కొత్త మోడల్ లను, వివిధ రకాల పవర్ ట్రైన్ కాంబినేషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అదనపు వెసులుబాటు లభిస్తుంది. విశాఖలో జరగనున్న ఏపీ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఈ భారీ విస్తరణ ప్రణాళికకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరి చాన్స్ ఉంది. కియా విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆటోమొబైల్ ఎకో సిస్టం వ్యవస్థను విస్తరించేందుకు ఇప్పటికే మూడు దక్షిణ కొరియా ఆటో విడిభాగాల తయారీ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
డిమాండ్ కు తగ్గట్టు…
ప్రపంచం తో పాటు మనదేశంలో కూడా కియో కార్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా పరిశ్రమ యాజమాన్యం పావులు కదుపుతోంది. మార్కెట్ డిమాండ్ కు తగినట్లుగా తమ పోర్ట్‌ఫోలియోను నిరంతరం విస్తరిస్తున్నామని.. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా విభిన్న సిగ్మెంట్లలో సరైన ఎంపికలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని కియా ఇండియా తెలిపింది. ఏపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి ఈ పెట్టుబడి ఒక మైలురాయిగా నిలవనుంది. వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇవి కూడ చదవండి:
-
తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
-
దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
-
అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
-
చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి .. ఘటనపై అనుమానాలు!
