Homeజాతీయంబీజాపూర్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్.. పేలుడు పదార్థాలు స్వాధీనం!

బీజాపూర్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్.. పేలుడు పదార్థాలు స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. తడపాల అటవీ ప్రాంతంలోని కేజీ హిల్స్ పరిసరాల్లో మావోయిస్టులు రహస్యంగా నిల్వ చేసిన భారీ డంప్‌ను అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, బ్యారల్ గ్రానైడ్ లాంచర్ (BGL) సెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో మావోయిస్టులు అడవుల్లోని రహస్య ప్రాంతాల్లో ఈ పేలుడు సామగ్రిని దాచి ఉంచినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. డంప్ బయటపడటంతో పరిసర అటవీ ప్రాంతాల్లో మరిన్ని పేలుడు పదార్థాలు ఉండే అవకాశాలపై అధికారులు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా కర్రెగుట్టల అడవుల్లోకి వెళ్లే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భద్రతా బలగాలు హెచ్చరించాయి. అడవుల్లోని పలు ప్రాంతాల్లో మందుపాతరలు అమర్చి ఉండే ప్రమాదం ఉందని వెల్లడించాయి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించాయి.

మావోయిస్టుల కదలికలు, రహస్య స్థావరాలపై నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.

also read: కామారెడ్డి జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు