Homeతెలంగాణకరీంనగర్ KFCలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. 90 కేజీల నూనె స్వాధీనం!

కరీంనగర్ KFCలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. 90 కేజీల నూనె స్వాధీనం!

కరీంనగర్‌లోని ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ KFC అవుట్‌లెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కలకలం రేపాయి. గురువారం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి, అక్కడ వినియోగిస్తున్న ఆహార పదార్థాలు, ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని నూనె నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 90 కేజీల నూనెను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఆహార తయారీలో ఉపయోగిస్తున్న ఇతర పదార్థాల నమూనాలను కూడా సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మరోవైపు, అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

సేకరించిన నమూనాలపై ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఆహార నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ల్యాబ్ నివేదికలో ఎలాంటి అంశాలు బయటపడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

also read: ఎనిమిదేళ్ల తర్వాత వోగ్ ఇండియా కవర్‌పై కత్రినా కైఫ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు