క్రైమ్ మిర్రర్ : గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడి వివరాలను వెల్లడిస్తూ ప్రజల సహకారం కోరింది. సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో నాలుగో నిందితుడు (A4)గా ఉన్న గులివిందల సురేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి తండ్రి పేరు ఆదినారాయణ. విజయవాడలోని సత్యనారాయణపురం అతడి స్వస్థలం. సురేశ్ వయస్సు సుమారు 40 సంవత్సరాలు కాగా, ఎత్తు సుమారు 5 అడుగుల 8 అంగుళాలు ఉంటుందని అధికారులు తెలిపారు.
కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు ఉద్దేశపూర్వకంగా పోలీసుల అరెస్టుకు దూరంగా ఉంటున్నాడని సిట్ పేర్కొంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. నిందితుడి ఆచూకీ, సంచార ప్రాంతాలు లేదా అతడు తలదాచుకున్న ప్రదేశానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల నంబర్లు 100 లేదా 112కు సమాచారం అందించాలని సిట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అలాగే, పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడం లేదా అతడిని దాచిపెట్టడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
also read : ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో విషాదం.. బీచ్‌లో గల్లంతైన ఇద్దరు స్నేహితులు
