HometelanganaGood News For Students: విద్యార్థులకు భారీ శుభవార్త...!

Good News For Students: విద్యార్థులకు భారీ శుభవార్త…!

  • విద్యార్థులకు భారీ శుభవార్త…!

  • తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్‌కూ బ్రాండెడ్ కిట్స్!

Crime Mirror, Telangana State Bureau: తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యాసంస్థలతో పాటు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా బ్రాండెడ్ నాణ్యతతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

Also Read: OTTలో ఈ వారం వినోదాల జాతర…!

ఈ భారీ కార్యక్రమం కోసం ప్రభుత్వం దాదాపు రూ.687.78 కోట్లను వెచ్చిస్తోంది. విద్యార్థులకు అందించే కిట్లలో రెండు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు వంటి అవసరమైన వస్తువులు ఉండనున్నాయి. గురుకులాలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు బెడ్‌షీట్లు, దుప్పట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు వంటి అదనపు సామగ్రిని కూడా అందించనున్నారు. దీంతో విద్యార్థులు నాణ్యమైన వస్తువులతో చదువుకునే అవకాశం కలగనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి కిట్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీనివల్ల అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకే రకమైన నాణ్యత కలిగిన వస్తువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది యూనిఫాం రంగుల్లో కూడా మార్పులు చేశారు.

Also Read: ఆస్పత్రుల్లో AI ఎంట్రీ.. రోగుల క్యూ కి చెక్ పడుతుందా…?

డే స్కాలర్స్‌కు లైట్ బ్లూ టాప్, డార్క్ బ్లూ లోయర్‌ను ఎంపిక చేయగా, గురుకుల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్, మెరూన్ లోయర్‌ను నిర్ణయించారు. విద్యార్థినులకు స్కర్టులు, పంజాబీ డ్రెస్సులు, చున్నీలు కూడా అందించనున్నారు.

ఈ పథకం ద్వారా విద్యార్థులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యూనిఫాంల కుట్టు పనులను మహిళా సంఘాలకు అప్పగించగా, దీనివల్ల వారికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: చీటీ రాసి…ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌…! గ్రామంలో విషాదం…

అలాగే రాష్ట్రంలోని చేనేత కార్మికులను ప్రోత్సహించేలా యూనిఫాంలు, బెడ్డింగ్ సామగ్రి తయారీ ఆర్డర్లలో గణనీయమైన భాగాన్ని చేనేత సహకార సంఘాలకు కేటాయించారు.

ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు కూడా బ్రాండెడ్ బ్యాగులు, బెల్టులు, టైలు, నల్ల బూట్లు, సాక్సులు ఉచితంగా అందించనున్నారు. దీంతో ప్రభుత్వ విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల స్థాయిలో సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత బలపడనుంది.

Also Read: త్రిష రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే బాబు..!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు