రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. తనిఖీల సందర్భంగా సుమారు రూ.25 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడెక్కడ చలామణి చేశారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
నకిలీ నోట్ల చలామణిని అడ్డుకునేందుకు బాలాపూర్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.
also read: 14 టోల్‌ప్లాజాలపై ఈడీ ఫోకస్.. అక్రమ సాఫ్ట్‌వేర్‌తో కోట్లాది రూపాయల మళ్లింపు!
