Homeతెలంగాణప్రైవేటుకు సింగరేణి...!

ప్రైవేటుకు సింగరేణి…!

  • భూగర్భ గనులు ఎండీఏ విధానంలో ఇతరులకు..

  • నష్టాల నివారణకు తప్పదు

  • కేంద్ర బొగ్గు గనుల శాఖ కీలక సిఫార్సులు..

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందా? కేంద్ర సిఫారసులను సింగరేణి సీరియస్ గా పరిశీలన చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సింగరేణి కాలరీస్ నష్ట నివారణ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూగర్భ గనులలో భారీగా నష్టాలు నమోదవుతున్న తరుణంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. భారీ నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇతర సంస్థల మాదిరిగా…

Also Read: మళ్లీ వార్తల్లోకి లేడీ అఘోరీ.. ఈసారి స్మశానంలో షాకింగ్ సీన్

తాజాగా కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు గని అభివృద్ధి, నిర్వహణ ఎండిఓ విధానంలో ఈ బదిలీ జరుగుతుంది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్ వంటి జాతీయ సంస్థలు ఇదే విధానం ద్వారా నష్టాలను తగ్గించుకుంటున్న నేపథ్యంలో.. సింగరేణి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందుకు ఓ ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థ సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి.. నిర్ణీత ధరకు సింగరేణికి అందిస్తుంది. సింగరేణి ఆ బొగ్గును మార్కెట్లో విక్రయిస్తుంది.

భారీగా నష్టం…

Also Read:ఈశ్వర్‌ సాయి కోసం పోలీసుల గాలింపు

ప్రస్తుతం టన్ను బొగ్గు ఉత్పత్తికి సుమారు రూ.21, 558 ఖర్చవుతుంది. కానీ విక్రయ ధర మాత్రం రూ.4167 మాత్రమే. అందుకే భూగర్భ గనుల తవ్వకాల్లో భారీగా నష్టం వస్తుంది. 2025 చివరి నాటికి 22 భూగర్భ గనులకు గాను 21 నష్టాల్లోనే ఉన్నాయి. వాటి మొత్తం నష్టం రూ.1924 కోట్లు. ఎంత నష్టాలలో ఉన్న సింగరేణి గట్టెక్కాలి అంటే ప్రైవేటీకరణ మార్గం అని కేంద్ర బొగ్గు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో ఎండిఓ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని సూచన చేసింది. లేదంటే సింగరేణి పూర్తిగా నష్టాల ఊపిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఉపరితల గనులను నిర్వహిస్తోంది. ఉపరితల గనుల లాభాలతోనే భూగర్భ నష్టాలను పూడ్చుకుంటున్న పరిస్థితి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు