Homeసినిమామమితా బైజుకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన మలయాళ నటి

మమితా బైజుకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన మలయాళ నటి

మలయాళ సినీ నటి మమితా బైజు అనారోగ్యానికి గురయ్యారు. అధిక జ్వరం, ఒంటినొప్పితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్యులు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఈ అనారోగ్యం కారణంగా ఈ వారం ఆస్ట్రేలియాలో జరగనున్న ఓనం వేడుకల కార్యక్రమానికి మమితా బైజు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని మమితా తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం మరోసారి ఆస్ట్రేలియాకు వచ్చి అభిమానులను కలుస్తానని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మమితా బైజు త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

also read: పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే.. నాగబాబు స్పెషల్‌ గిఫ్ట్‌.. అభిమానులకు కీలక పిలుపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు