Homeతెలంగాణఅందాల సిగ్నేచర్ బ్రిడ్జి...!

అందాల సిగ్నేచర్ బ్రిడ్జి…!

  • విజయవాడ- అమరావతి మధ్య కొత్త వంతెన

  • అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు నిర్ణయం

  • రూ.1000 కోట్లతో రూపుదిద్దుకోనున్న వైనం..

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిలో మరో కీలక ప్రాజెక్ట్. అమరావతి- విజయవాడల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. కృష్ణ నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మక సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 1000 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది. ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. డిపిఆర్ తయారీకి ప్రాధమికంగా అడుగులు వేస్తోంది.

కేవలం బ్రిడ్జిగానే కాకుండా...

Also Read:ఈశ్వర్‌ సాయి కోసం పోలీసుల గాలింపు

అయితే ఈ సిగ్నేచర్ బ్రిడ్జి ను కేవలం రవాణా రాకపోకలకు మాత్రమే కాదు. అమరావతి రాజధానికి మణిహారంగా నిలిపేందుకు ఈ వంతెన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయాలని చూస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ, రైల్వే వంతెనల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవున.. ఆరు లేన్ల విశాలమైన రహదారితో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. విజయవాడ నగరంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీని అందించి… భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలకు శాశ్వత పరిష్కార మార్గంగా నిలవనుంది.

పర్యాటకంగా సైతం…

Also Read:మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. మోదీ ఉన్న ఫొటోను కట్ చేసి పోస్ట్

పర్యాటకంగా సైతం దీనిని మలచనున్నారు. కేవలం రవాణా వ్యవస్థ కోసమే కాకుండా.. రాజధాని అమరావతికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్కుగా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా వంతెన ఇరువైపులా కాలినడకన వెళ్లే వారి కోసం ఫుడ్ పాత్ లు, పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. నది అందాలను తిలకించేలా ఆధునిక లైటింగ్, ప్రత్యేక వ్యూ పాయింట్లతో ఈ వంతెనను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంది. కృష్ణా నదిపై రూపుదిద్దుకోబోతున్న ఈ మౌలిక వస్తువుల ప్రాజెక్టు ఏపీ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోయినది. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తూ.. అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో మరొక ప్రతిష్టాత్మకమైన కట్టడం గా.. ఈ సిగ్నేచర్ బ్రిడ్జి నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు