Homeక్రైమ్పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ యువకుడు మృతి

పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ యువకుడు మృతి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవులో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్‌గా (22 ) పోలీసులు గుర్తించారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రేమ్ కుమార్ స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం.

వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తూ తగలడంతో షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జనసేన కార్యకర్తలు, స్థానికుల్లోనూ విషాద వాతావరణం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

also read: బాలాపూర్‌లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు