Homeజాతీయంవృద్ధురాలికి సన్‌గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్.. వైరల్‌గా మారిన ఫొటోలు

వృద్ధురాలికి సన్‌గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్.. వైరల్‌గా మారిన ఫొటోలు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మేట్టూరు పర్యటనలో ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళవారం మేట్టూరులో పర్యటించిన సీఎం విజయ్.. ఓ రైతు ఇంటికి వెళ్లారు. అక్కడ ‘చెల్లం’ అనే వృద్ధురాలితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెతో సాదరంగా ముచ్చటించిన సీఎం.. తాను ధరించిన సన్‌గ్లాసెస్‌ను ఆమెకు బహుమతిగా అందించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతిని అందుకున్న వృద్ధురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సన్‌గ్లాసెస్‌ను ధరించి సీఎం విజయ్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వృద్ధురాలితో సీఎం ఆప్యాయంగా మాట్లాడుతున్న దృశ్యాలు, ఆమెకు సన్‌గ్లాసెస్ అందించిన సందర్భం నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చూపించిన ఆప్యాయతపై పలువురు నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

also read: 30 ఏళ్లుగా అన్నానికి దూరం.. రోజూ 20 టీలు, వేరుశనగలతోనే జీవనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు