Homeతెలంగాణఎంఐఎం పట్టు సడలుతోందా...?

ఎంఐఎం పట్టు సడలుతోందా…?

  • ఓవైసీ బ్రదర్స్ ఆదేశాలు బుట్ట దాఖలు

  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది లేదంటున్న రహమత్ బేగ్

  • పాత బస్తీలో సరికొత్త ప్రకంపనలు

 

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం పార్టీది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఆ పార్టీ పాతుకు పోయింది. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా వారి సంప్రదాయ బలాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నారు. కానీ అటువంటి పార్టీలో ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ పట్టు తప్పుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఓవైసీ బ్రదర్స్ మాటే శాసనం. దశాబ్దాలుగా అధిష్టానం నుంచి ఒక ఆదేశం వస్తే శిరసా వహించడం తప్ప ఎదురు చెప్పే ధైర్యం ఏ నాయకుడికి లేదు. క్యాడర్ సైతం ఆ బ్రదర్స్ ఆదేశాలు పాటించాల్సిందే. అటువంటిది ఒక ధిక్కారస్వరం ఇప్పుడు వినిపించింది. మైనర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్.. ఓవైసీ ఆదేశాలను ధిక్కరిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

సాధారణ డ్రైవర్ నుంచి ఎమ్మెల్సీగా…

Also Read:భారీ కట్నం ఇచ్చినా తీరని దాహం.. భర్త, అత్తింటి వేధింపులకు బలి

ఒక సాధారణ ఎమ్మెల్యే డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించి.. హై కమాండ్ దయతో ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు రహమత్ బేగ్. లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు సంచలనాత్మక వీడియో లీక్ వివాదం రావడంతో.. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా బేగ్ పార్టీ అధినేతల ఆదేశాలు పాటించకుండా.. నేను రాజీనామా చేయను, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తానంటూ తెగేసి చెప్పారు. దీంతో ఓవైసీ సోదరులకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది..

గొప్ప సాహసం…

Also Read: మళ్లీ వార్తల్లోకి లేడీ అఘోరీ.. ఈసారి స్మశానంలో షాకింగ్ సీన్

సాధారణంగా ఎంఐఎం నుంచి బహిష్కరణకు గురైన నేతకు వేరే రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు సాహసించవు. అటు రాజకీయ మద్దతు లేక.. ఎంఐఎం తిరుగుబాటుదారుడుగా ముద్రపడిన.. ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకోవడానికి రహమత్ బేగ్ సిద్ధంగా లేకపోవడం పాతబస్తీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు పాత బస్తీని తమ గుప్పెట్లో పెట్టుకుని క్యాడర్ను శాసించిన ఓవైసీల స్వరం ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ వద్ద పనిచేయడం లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేదు. పాతబస్తీలో మాత్రం ఎంఐఎం అది కూడా ఓవైసీ బ్రదర్స్ ఆదేశాలతోనే నడిచేవి రాజకీయాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు