Homeతెలంగాణమళ్లీ వార్తల్లోకి లేడీ అఘోరీ.. ఈసారి స్మశానంలో షాకింగ్ సీన్

మళ్లీ వార్తల్లోకి లేడీ అఘోరీ.. ఈసారి స్మశానంలో షాకింగ్ సీన్

క్రైమ్ మిర్రర్ : తెలుగు రాష్ట్రాల్లో గతంలో వివాదాస్పదంగా వార్తల్లో నిలిచిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించినప్పటికీ.. ప్రస్తుతం ఉత్తరాది ప్రాంతాల్లో పర్యటిస్తూ గతంలో మాదిరిగానే వివాదాస్పద వీడియోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఓ స్మశానంలో చిత్రీకరించినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కాలుతున్న చితి వద్ద మానవ శరీరానికి సంబంధించిన భాగాలను తీసుకుంటూ తింటున్నట్లు కనిపిస్తున్నారు. అవి వేడిగా, రుచిగా ఉన్నాయని చెబుతూ.. తాను మనుషుల మాంసాన్ని తింటానంటూ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో వినిపిస్తోంది.

అంతేకాకుండా తాను ఎంతోమంది మంత్రగాళ్లను ఎదుర్కొన్నానని, తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. స్మశానంలో ఉండటం, భూతప్రేతాలతో వ్యవహరించడమే తనకు ఇష్టమని కూడా వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. కొద్దిపాటి మానవ శరీర భాగాలను తీసుకున్నా తన ఆకలి తీరిపోతుందని ఆమె వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి చర్యలపై పోలీసులు దృష్టి సారించి, వీడియో నిజమైనదేనా? ఎక్కడ చిత్రీకరించారు? అందులో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అనే అంశాలపై విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే వైరల్‌గా మారిన వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు, అందులోని దృశ్యాల వాస్తవికతపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
also read : ఈశ్వర్‌ సాయి కోసం పోలీసుల గాలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు