Homeక్రైమ్హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

క్రైమ్ మిర్రర్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.

సింగిల్ బెంచ్ గతంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి మార్చాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆయన తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు.

వాదనలు పరిశీలించిన డివిజన్ బెంచ్.. రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తప్పించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాల అమలును ప్రస్తుతానికి నిలిపివేసింది. నవంబర్ 3న కేసును మరోసారి విచారించనున్నట్లు తెలిపింది. అయితే లోతుకుంటలోని భూములకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. మేనకోడలు అనుమానాస్పద మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు