Homeజాతీయంఅన్నా హజారేకు అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

అన్నా హజారేకు అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. దీంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయనను చేర్పించారు.

తొలుత మహారాష్ట్రలోని రాలేగణ్ సిద్ధి సమీపంలోని ఓ ఆసుపత్రిలో హజారేకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు.

ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కిడ్నీ పనితీరుతో పాటు ఇతర కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వైద్యుడు గౌతమ్ భన్సాలి పర్యవేక్షణలో అన్నా హజారేకు చికిత్స కొనసాగుతోంది.

87 ఏళ్ల అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: ఆశ్రమం ముసుగులో మైనర్‌పై లైంగిక దాడి.. స్వామీజీ అరెస్ట్

తాజావార్తలు