-
రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశం
-
దానిని కొట్టి వేస్తూ ఈరోజు డివిజనల్ బెంచ్ నిర్ణయం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్ ను తొలగించాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.. డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తూ న్యాయస్థానం కీలకతీర్ణం వెల్లడించింది. గతంలో హైడ్రా కమిషనర్ నియామకం, బాధ్యతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్.. రంగనాథ్ ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం తరఫున, సంబంధిత వర్గాలు వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించి ఆపిల్ ను దాఖలు చేశాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో అంశాలను పున పరిశీలించాలని కోరాయి.
దూకుడుగా హైడ్రా…
Also Read: సముద్ర మట్టాల పెరుగుదలతో భారీ ముప్పు.. భారత్‌లో ఈ నగరాలకు డేంజర్ బెల్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చింది. అక్రమ నిర్మాణాల పేరుతో పెద్ద ఎత్తున కూల్చివేతలకు పాల్పడింది. చెరువులతోపాటు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ పేరుతో పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో వేలకోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి దక్కాయి. అయితే దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తులు వెనక్కి రావడంతో వారంతా న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే న్యాయస్థానాల ఆదేశాలను పాటించకుండా హైదరాబాద్ ముందుకు వెళ్లిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలా సార్లు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా అందుకుంది హైడ్రా. ఈ క్రమంలో కోర్టు హైడ్రా కమిషనర్ను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ వర్గాలు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించాయి.
ఈరోజు విచారణ…
Also Read:లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టోలిచౌక్ ఎస్సై
తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన పిటిషన్ అనుసరించి విచారణ చేపట్టింది హైకోర్టు డివిజనల్ బెంచ్. సింగిల్ బెంచ్ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను నిలిపివేస్తూ మభ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ తన విధులను యధావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి పూర్తిస్థాయి విచారణను హైకోర్టు నవంబర్ మూడుకు వాయిదా వేసింది. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ దిశగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
