Homeతెలంగాణకొండా సురేఖ పై కీలక నిర్ణయం...!

కొండా సురేఖ పై కీలక నిర్ణయం…!

  • సీరియస్ చర్యలు దిశగా హై కమాండ్

  • ఢిల్లీకి క్యూ కట్టిన నేతలు

  • విస్తృత చర్చల తర్వాత తుది నిర్ణయం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ పై వేటు తప్పదా? హై కమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందా? అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ తో పాటు ఇతర ముఖ్య నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే నివేదికలు హై కమాండ్ కు చేరాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సర్వత్ర చర్చ…

Also Read:లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టోలిచౌక్ ఎస్సై

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ ప్రయాణం కావడం హాట్ టాపిక్ అవుతుంది. సురేఖ పై పార్టీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ పెద్దలు.. సురేఖ వ్యవహారానికి సంబంధించి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు అందరిని ఢిల్లీకి రప్పించి విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించారు.

టిపిసిసి చీఫ్ సైతం…

Also Read: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా నేడు సాయంత్రానికి ఢిల్లీకి వెళ్ళనున్నారు. వీరితో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన సైతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు, వరంగల్ జిల్లా నేతలతో ఉన్న విభేదాలపై ఇప్పటికే క్రమశిక్షణ సంఘం ఒక సమగ్ర నివేదికను ఏఐసీసీకి అందజేసింది. తరువాత ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

నేతలతో వేరువేరుగా భేటీ…

Also Read:భారీ కట్నం ఇచ్చినా తీరని దాహం.. భర్త, అత్తింటి వేధింపులకు బలి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత కేసి వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అదే సమయంలో ఇతర ముఖ్య నేతలు, టిపిసిసి అధ్యక్షుడు వేర్వేరుగా సమావేశం అవుతారని తెలుస్తోంది. సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలా? లేదా ఆమెతో స్వచ్ఛందంగా రాజీనామా చేయించాలా? అనే అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ఒకవేళ సురేఖను పదవి నుంచి తొలగిస్తే తలెత్తే రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణలు, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ, చేర్పులు మార్పులపై కూడా నేతల అభిప్రాయాలను సేకరించనుంది హై కమాండ్. మరి చివరికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు