Homeరాజకీయంపవన్ బర్త్‌డే స్పెషల్.. ‘OG’ నుంచి అదిరిపోయే ట్రీట్‌! సుజీత్ ఎమోషనల్ పోస్ట్

పవన్ బర్త్‌డే స్పెషల్.. ‘OG’ నుంచి అదిరిపోయే ట్రీట్‌! సుజీత్ ఎమోషనల్ పోస్ట్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘OG’ మూవీ టీమ్ నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

పవన్ కల్యాణ్ సినిమాలను అభిమానిగా చూస్తూ పెరిగిన తనకు.. ఇప్పుడు అదే హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని సుజీత్ పేర్కొన్నారు. తాను అభిమానించిన హీరోనే ఇప్పుడు తన సినిమా హీరోగా మారడం తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదనే భావనను వ్యక్తం చేశారు.

తన సినీ ప్రయాణంలో తొలి హీరోగా పవన్ కల్యాణ్‌కు ఉన్న ప్రత్యేకతను గుర్తుచేసుకుంటూ.. ఆయన్ను తన ‘OG’గా అభివర్ణించారు. పుట్టినరోజు సందర్భంగా పవన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇక పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘OG’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను కూడా ప్రకటించారు. బుధవారం సాయంత్రం 4:05 గంటలకు ‘OG యూనివర్స్’ నుంచి అభిమానులకు స్పెషల్ ట్రీట్ రాబోతుందని వెల్లడించారు. దీంతో అసలు ఆ ట్రీట్ ఏంటనే ఆసక్తి పవన్ అభిమానుల్లో మొదలైంది.

పవన్ కల్యాణ్–సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘OG’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడి ఎమోషనల్ పోస్ట్‌తో పాటు 4:05 PM ట్రీట్ ప్రకటన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

also read: పవన్ కల్యాణ్‌కు భార్య అన్నా కొణిదెల ప్రత్యేక శుభాకాంక్షలు.. వైరల్‌గా మారిన పోస్ట్

తాజావార్తలు