Homeరాజకీయంపవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే.. నాగబాబు స్పెషల్‌ గిఫ్ట్‌.. అభిమానులకు కీలక పిలుపు

పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే.. నాగబాబు స్పెషల్‌ గిఫ్ట్‌.. అభిమానులకు కీలక పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్‌ బోర్డు ఛైర్మన్‌, ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ పేరుతో మారేడు మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

మారేడు దళాలు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనవని నాగబాబు పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్‌ కల్యాణ్‌కు తన తరఫున ఇదొక ప్రత్యేక కానుకగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

పవన్‌ కల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని తాను మొత్తం 20 మొక్కలు నాటినట్లు నాగబాబు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా అభిమానులు కూడా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

పవన్‌ కల్యాణ్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నాగబాబు పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు.

also read: పవన్ బర్త్‌డే స్పెషల్.. ‘OG’ నుంచి అదిరిపోయే ట్రీట్‌! సుజీత్ ఎమోషనల్ పోస్ట్

తాజావార్తలు