Homeతెలంగాణపూల సుబ్బయ్య ఎవరు...? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ...

పూల సుబ్బయ్య ఎవరు…? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు …

  • గత రెండు రోజులుగా విస్తృత చర్చ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కరువు ప్రాంతానికి కృష్ణమ్మ వెళ్ళింది. వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టుకు పోలీస్ సుబ్బయ్య అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునంద నీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని సీఎం చంద్రబాబు సన్మానించడంతో రాష్ట్రవ్యాప్తంగా పూల సుబ్బయ్య పై చర్చ మొదలైంది. కరువు నేలకు కృష్ణా జలాలను తరలించాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి పూల సుబ్బయ్య. ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి నందమూరి తారక రామారావు ఒక నివేదికను కోరారు అప్పటి ఇంజనీరింగ్ సలహాదారుడు రామకృష్ణ. కార్యక్రమంలో అదే ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. నేడు ప్రారంభించారు. అయితే కృష్ణా జలాలను కరువు సీమకు తరలించాలని ఉద్యమించిన పూల సుబ్బయ్య పేరును ప్రాజెక్టుకు పెట్టారు చంద్రబాబు. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం.

కమ్యూనిస్టు నాయకుడు…

Also Read:మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. మోదీ ఉన్న ఫొటోను కట్ చేసి పోస్ట్

పూల సుబ్బయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. మార్కాపురం జిల్లా కంభం లో 1929లో జన్మించారు. ఆయన బాల్యంలోనే ఉండగానే తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి చదివించింది. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, న్యాయవాదిగా, కార్మిక సంఘం నాయకుడిగా, తాలూకా, జిల్లాస్థాయి పదవులు చేపడుతూ ఏపీ రైతు సంఘం కార్యదర్శిగా ఎదిగారు. 1962, 67లో ఎర్రగొండపాలెం సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి 1978లో మార్కాపురం నుంచి గెలిచారు. గిరిజన హక్కుల కోసం పోరాడారు. ఆ సమయంలోనే తాగు, సాగునీటి సౌకర్యాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు తరలించాలని ఉద్యమ బాట పట్టారు.

అలా పట్టాలెక్కిన ప్రాజెక్ట్…

Also Read:చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు పట్టివేత

అప్పట్లో పశ్చిమ ప్రకాశం ప్రజల ఆర్తనాదాలు విన్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలా ఎన్టీఆర్ హయాంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టుకు 1996 మార్చి ఐదున చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల పాటు అనేక పరిణామాలు చోటుచేసుకుని మొదటి దశ పూర్తి చేసుకుంది వెలిగొండ ప్రాజెక్టు. కానీ ఈ ప్రాంతం కోసం పోరాటం చేసిన పూల సుబ్బయ్య 1988లో అనారోగ్యంతో మృతి చెందారు. అయితే వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టాలన్న ప్రతిపాదన రావడంతో.. ఆయన పేరును ఖరారు చేసింది ప్రభుత్వం. అందుకే పూల సుబ్బయ్య కుమార్తెలను వేదిక పైకి పిలిచి మరి సన్మానించారు చంద్రబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు