Homeఆంధ్ర ప్రదేశ్సచిన్ ప్రవర్తనకు ఆంధ్రులు ఫిదా!

సచిన్ ప్రవర్తనకు ఆంధ్రులు ఫిదా!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ అతిథిగా పాల్గొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తను ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెజెండరీ క్రికెటర్ సచిన్ కొరకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ వెంటనే తన షూ విప్పివేసి భక్తితో నమస్కరించి విగ్రహాన్ని అందుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును దోచుకున్నారు. దైవానికి అలాగే భక్తి పట్ల అతనికి ఎంతటి గౌరవం ఉంది అనేది ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. అంతటి పెద్ద వ్యక్తి దైవం పట్ల అతనికి ఉన్నటువంటి భక్తి భావాన్ని చూసి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రముఖ వ్యక్తులు ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ఇది కదా నేర్చుకోవాల్సింది అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ ను పొగుడుతున్నారు. కాగా వివిధ సందర్భాలలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు దైవ విగ్రహాలను బహుమతిగా ఇస్తున్న సమయంలో చెప్పులను ధరిస్తున్న దృశ్యాలు మనం సోషల్ మీడియాలో ఎన్నోసార్లు చూసుంటాం. ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాలలో సోషల్ మీడియాలో నిలిచిన విషయాలను చూసాం.

కారు భీభ‌త్స‌వం….న‌లుగురు స్పాట్ డెడ్‌…!

కారు భీభ‌త్స‌వం….న‌లుగురు స్పాట్ డెడ్‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు