క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ పదో తరగతి (SSC) ఫలితాల విడుదలకు విద్యాశాఖ ముహూర్తాన్ని దాదాపు ఖరారు చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఫలితాలను ఏప్రిల్ 29 లేదా 30వ తేదీల్లో (రేపు లేదా ఎల్లుండి) విడుదల చేసే అవకాశం మెండుగా ఉంది అని సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను BSE Telangana Official Site ద్వారా లేదా ఇతర ప్రముఖ విద్యా పోర్టల్‌ల ద్వారా చూసుకోవచ్చు.
వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించినప్పటికీ, మూల్యాంకనం (Evaluation) వేగంగా పూర్తి కావడంతో ఈ నెలాఖరుకే విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశారు. సాధారణంగా ఫలితాలను మధ్యాహ్నం 11:00 గంటల నుండి 2:30 గంటల మధ్య మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తారు.