క్రైమ్ మిర్రర్ : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారని, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులను హత్య చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారా హెచ్చరిస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఈ బెదిరింపులపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, రాజకీయ భిన్నాభిప్రాయాల కారణంగా బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకర పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై కూడా ఆయన స్పందించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. అభిజీత్ దీప్కే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఆయన చేసిన ఆరోపణలపై సంబంధిత పక్షాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
also read : విజయవాడ పై జనసేన గురి…!
