Homeక్రైమ్ గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని.. ముగ్గురు సిబ్బంది సస్పెండ్

 గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని.. ముగ్గురు సిబ్బంది సస్పెండ్

అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పాఠశాల హెచ్‌ఎం శాంతమతి, వార్డెన్ విజయగంధం, టీచర్ లోవమ్మలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాల వంట మనిషి మంగరాజుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాధిత విద్యార్థినికి ప్రస్తుతం అవసరమైన వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ డీడీ వెల్లడించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

also read: దారుణ హత్య.. ఎఫైర్ అనుమానంతో యువకుడిని 17 సార్లు కత్తితో పొడిచి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు