మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో రవితేజ కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన రవితేజ అభిమానులు, ఓటీటీ ప్రేక్షకులు సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ‘ఇరుముడి’ని వీక్షించవచ్చు.
also read: విజయ్ వర్మపై నేహాల్ వడోలియా సంచలన ఆరోపణలు.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ వీడియో!
