Homeక్రైమ్చింతపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి...! ఆరుగురు పేకాట‌రాయుళ్ల అరెస్టు...

చింతపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…! ఆరుగురు పేకాట‌రాయుళ్ల అరెస్టు…

  • 7,500 నగదు, 104 పేకముక్కలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం

చింతపల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌: చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని, చింతపల్లి ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి హెచ్చరించారు. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో, డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో, పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,500 నగదు, 104 పేకముక్కలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 27న సాయంత్రం చింతపల్లి గ్రామ శివారులోని, మహమ్మద్‌ ఖలీద్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో, కొందరు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనితో హెడ్‌ కానిస్టేబుల్‌ నట్టువ వెంకటకృష్ణతో పాటు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఘటనా స్థలంలో నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, గేమింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 9(1) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. చింతపల్లి గ్రామానికి చెందిన కుండెల్ల చెన్నయ్య (39), కదారి సత్యనారాయణ (33), పిల్లి వెంకన్న (56), కదారి సైదులు (34), ఉజ్జిని రఘురాంరావు (45), మహమ్మద్‌ ఖలీద్‌ (45)లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేకాట వంటి జూదపు అలవాట్లు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు అప్పులపాలై, కుటుంబ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల కుటుంబాల్లో కలహాలు పెరిగి, పిల్లల భవిష్యత్తుపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి పరిసర ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో రహస్యంగా పేకాట నిర్వహించే వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యువత జూదానికి అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వారిపైనా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై చట్టప్రకారం వ్యవహరిస్తామని ఎస్‌ఐ రామ్మూర్తి హెచ్చరించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  కర్ణాటకలో కాంగ్రెస్ కు షాక్…! బీజేపీ-జేడీఎస్ కూట‌మి క్లీన్‌స్వీప్‌…
  2. శిష్యుడిపై యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు..!
  3.  కొచ్చిలో నేడు WPL ఆటగాళ్ల వేలం: స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటీ!
  4.  శబరిమల ‘మకరవిళక్కు’ యాత్ర: రేపు ఉదయం 10 గంటల నుంచి వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్స్ షురూ!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు