-
నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర పరాజయం
-
పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎన్డీఏ వైపు మొగ్గు
-
మారనున్న కన్నడ రాజకీయ సమీకరణలు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విధాన పరిషత్ లో ఖాళీ అయిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి – జెడిఎస్ కూటమి ప్రభంజనం సృష్టించింది. నాలుగు స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. బిజెపి మూడు స్థానాల్లో విజయం సాధించగా.. జెడిఎస్ ఒక స్థానంలో గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ నాలుగు స్థానాల్లో రెండు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కావడం గమనార్హం. సమాజంలో చదువుకున్న వారు, ఉపాధ్యాయులు తీర్పు ఇచ్చే ఈ స్థానాల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినడం కన్నడ రాజకీయాల్లో మార్పునకు సూచిస్తోంది.
ప్రతిష్టాత్మక పోరు…
ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఎన్డీఏ ముందు నిలబడలేకపోయింది. బెంగళూరు టీచర్స్ స్థానం నుంచి జెడిఎస్ బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఏపీ రంగనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నేత పట్టణ ను ఓడించారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి శశిల్ జి నమోషి ఐదోసారి గెలిచి రికార్డు సృష్టించారు. పశ్చిమ ఆగ్నేయ పట్టభద్రుల స్థానాల్లో కూడా ఎన్డీఏ పక్షాల విజయాన్ని కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్రంగా వేరువేరుగా పోరాడిన స్థానాల్లో ఈసారి బిజెపి జెడిఎస్ పక్కా వ్యూహంతో సమన్వయమయ్యాయి. తమ ఓటు బ్యాంకు ను సక్రమంగా బదిలీ చేసుకోవడంతో ఎన్డీఏ కు కలిసి వచ్చింది.
ప్రజల్లో వ్యతిరేకత…
కాంగ్రెస్ పార్టీకి ఇది డేంజర్ బెల్ లాంటిది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తం అయిన తీవ్ర అసంతృప్తి, రాష్ట్రంలో సిద్ధరామయ్య, శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యారెంటీ పథకాలు గ్రామీణ పేదలకు మేలు చేస్తున్నాయి. కానీ అభివృద్ధి నిధుల కొరత, పన్నుల భారం, ఉద్యోగుల పాత పెన్షన్ స్కీం, డి ఎ చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం మేధావి వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణం అయ్యింది. బెంగళూరు వంటి ఐటీ అర్బన్ పరిధిలో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల బదిలీ విధానాలు, గ్రాడ్యుయేట్ యువతకు ఉద్యోగ కల్పనలో ఎదురవుతున్నా అవాంతరాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఈ ఫలితాలు రాబోయే కాలంలో కర్ణాటక రాజకీయ సమీకరణలపై తీవ్ర ప్రభావం చూపి అవకాశం ఉంది. సమాజంలో మేధావి వర్గంగా భావించేవారు ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పేలా లేదు.
ఇవి కూడ చదవండి:
-
రఘురామకృష్ణం రాజుకు షాక్…!
-
ఏపీకి ప్రధాని మోదీ…!
-
మునుగోడులో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్ దేవసేన…!
-
కార్ల రేసింగ్.. రెండు ప్రాణాలు బలి.. భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలు
