-
మూడు రోజులపాటు తిరుపతిలోనే..
-
డిసెంబర్ 4 నుంచి 6 వరకు హోం శాఖ జాతీయ సదస్సు..
-
అమిత్ షా తో పాటు పారా మిలటరీ విభాగాధిపతులు సైతం..
-
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఇందుకు ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదిక కానుంది. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి కీలక సమావేశం అక్కడ జరగనుంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్త డీజిల్, ఐజిపిల వార్షిక జాతీయ సదస్సును తిరుపతిలో నిర్వహించేందుకు నిర్ణయించారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాంగణంలో నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ అధికారికంగా నిర్ణయించింది. ఈ అత్యున్నత భద్రత సమావేశానికి ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
వ్యూహాత్మకంగా తిరుపతి ఎంపిక…
కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి కొలువు దీరిన తర్వాత ఏపీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఒకే వేదికపై పర్యటించనుండడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది.. దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం కాకుండా భద్రతా సమావేశాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఈసారి తిరుపతిని ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపిలు, ఐ జి పీ లతోపాటు కేంద్ర నిఘా సంస్థలైన ఐబి, రా, ఎన్ఐఏ, సిబిఐ, పారా మిలటరీ బలగాలైన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశానికి ఏపీ వేదిక అవుతుండడం విశేషం. మూడు రోజులపాటు జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ, అమిత్ షాలు పోలీసు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి శాంతిభద్రతల పరిస్థితులపై ముఖాముఖి సమాలోచనలను జరపనున్నారు.
అంతర్గత భద్రతపై…
ప్రధానంగా దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, మావోయిస్టుల కట్టడి వంటి కీలక సవాళ్లపై సమగ్రమైన రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు. ఆధునిక కాలంలో ఏఐ వినియోగం ద్వారా పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, కొత్త నేర న్యాయ చట్టాల అమలు తీరుతెన్నులపై ప్రాథమికంగా చర్చిస్తారు. గత సమావేశాల్లో ప్రధాని మోదీ ఇచ్చిన స్మార్ట్ఫోన్ సింగ్ విధానం ఏ మేరకు అమలవుతుందోనన్న అంశంపై కూడా సందర్భంగా నివేదికలు సమీక్షించనున్నారు. కేవలం ప్రధాని, హోం శాఖ మంత్రి మాత్రమే కాదు.. దేశభద్రత యంత్రాంగమంతా తిరుపతిలోనే మోహరించనుంది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది. ఐసర్ పరిసరాలు, తిరుపతి నగరం చుట్టూ బహుళ అంచల పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర అగ్ర నేతలు పాల్గొంటున్న అతిపెద్ద జాతీయ సదస్సు ఇదే కావడం గమనార్హం.
ఇవి కూడ చదవండి:
-
గౌహతిలో దారుణం.. హోటల్ లీజు వివాదం.. కాల్పుల్లో ఐదుగురు మృతి!
-
ఏపీ అభివృద్ది ధ్యేయంగా పని చేస్తున్నాం…! డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
-
రేవంత్ మహారాష్ట్ర బాట…! తుమ్మిడిహెట్టి బ్యారేజీ పట్టాలెక్కేనా…?
-
రిలయన్స్ జియో ప్రభంజనం…!
