క్రైమ్ మిర్రర్ : రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందిన విషాద ఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చదువుకుంటున్న వయసులోనే విద్యార్థి మృతి చెందడంతో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి తన స్నేహితుడిని హయత్నగర్ బస్టాండ్ వద్ద దింపి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో లారీ ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అభిలాష్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ప్రమాదానికి గురయ్యాడు? లారీ ఏ విధంగా ఢీకొట్టింది? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read : గౌహతిలో దారుణం.. హోటల్ లీజు వివాదం.. కాల్పుల్లో ఐదుగురు మృతి!
